Patanjali: మీ యాడ్స్‌ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు

పతంజలి సంస్థపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్‌పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా, బాలకృష్ణలను ప్రశ్నించింది.

New Update
Patanjali: మీ యాడ్స్‌ సైజ్‌లోనే క్షమాపణలు ఉంటాయా : సుప్రీంకోర్టు

Supreme Court On Patanjali Ads Case: తప్పుడు ప్రకటనలు చేసినందుకు పతంజలి ఆయుర్వేద సంస్థపై వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ సంస్థపై దాఖలైన పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై న్యూస్‌పేపర్లలో ఫుల్ పేజీ ప్రకటను ఇచ్చిన సైజ్‌లోనే క్షమాపణల ప్రకటన కూడా ఉంటుందా అంటూ రాందేవ్ బాబా (Ramdev Baba) , బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే వాళ్లిద్దరి తరఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ తాజాగా కోర్టుకు మరోసారి క్షమాపణ అఫిడవిట్లను సమర్పించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. గతంలో క్షమాపణలు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు అఫిడవిట్లు దాఖలు చేశారంటూ అడిగింది. దీంతో ముకుల్ స్పందిస్తూ.. రూ.10 లక్షలు ఖర్చు పెట్టి 67 వార్తాపత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చామని తెలిపారు.

Also Read: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. రంగంలోకి దిగిన భారత ఆహార భద్రత సంస్థ

దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ హిమా కోహ్లీ మాట్లాడుతూ.. మీ క్షమాపణను ప్రముఖంగా ప్రచురించారా ? గతంలో మీరు ఇచ్చినట్లుగానే పెద్ద అక్షరాలు, పెద్ద సైజులో క్షమాపణ ఉంటుందా అంటూ నిలదీశారు. క్షమాపణ చెప్పేందుకు పతంజలి కంపెనీ లక్షల్లో ఖర్చు చేసిందని ముకుల్ చెప్పగా.. ఆ విషయం తమకు అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మరోసారి పెద్ద సైజులో అదనపు ప్రకటనలు ప్రచూరిస్తామని ముకుల్ కోర్టుకు తెలిపారు.

మరోవైపు పతంజలి (Patanjali) సంస్థపై కోర్టును ఆశ్రయించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు రూ. వెయ్యి కోట్లు జరిమానా విధించాలంటూ పిటిషన్ దాఖలు చేయడంపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇది మీకు బదులుగా వేయించిన పిటిషనా అంటూ ప్రశ్నించింది. అయితే ఈ పిటిషన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ముకుల్ వివరించారు. చివరికి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. అలాగే కోర్టు ధిక్కర అంశాన్ని కూడా అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణ ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఉగ్రదాడులపై బీజేపీ వేగంగా స్పందిస్తోంది : మాజీ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ చీఫ్

Advertisment
తాజా కథనాలు