APCOB Recruitment 2023: ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను (35 Staff Assistant Vacancies) భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. కాగా ఈ పోస్టులకు పరీక్షను నవంబర్ లో నిర్వహించనున్నారు.
ముఖ్యమైన వివరాలు:
రిక్రూట్ మెంట్ నిర్వహించే సంస్థ - ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్
ఉద్యోగాలు - స్టాఫ్ అసిస్టెంట్
ఖాళీలు - 35
ఇది కూడా చదవండి: రూ. 100కంటే తక్కువ ధరకే సినిమా టికెట్..ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే..!!
అర్హతలు:
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ణానం తప్పని సరిగా ఉండాలి. వారికే మొదటి ప్రాథాన్యత ఉంటుంది.
వయస్సు:
1-10-2023 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:
నెలకు రూ. 17,900 నుంచి 47,920 ఉంటుంది.
ఫీజు:
జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500గా నిర్ణయించారు.
ఎంపిక విధానం:
ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:
అక్టోబర్ 21, 2023
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు తుది గడువు:
అక్టోబర్ 21, 2023
ఎగ్జామ్ తేదీ:
నవంబర్, 2023
అధికారిక వెబ్సైట్ - https://apcob.org/
ఇది కూడా చదవండి: నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. గుండెపోటు వచ్చే ఛాన్స్..!