APCOB Recruitment 2023: ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. By Bhoomi 13 Oct 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి APCOB Recruitment 2023: ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను (35 Staff Assistant Vacancies) భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21 వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. కాగా ఈ పోస్టులకు పరీక్షను నవంబర్ లో నిర్వహించనున్నారు. ముఖ్యమైన వివరాలు: రిక్రూట్ మెంట్ నిర్వహించే సంస్థ - ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలు - స్టాఫ్ అసిస్టెంట్ ఖాళీలు - 35 ఇది కూడా చదవండి: రూ. 100కంటే తక్కువ ధరకే సినిమా టికెట్..ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే..!! అర్హతలు: పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ణానం తప్పని సరిగా ఉండాలి. వారికే మొదటి ప్రాథాన్యత ఉంటుంది. వయస్సు: 1-10-2023 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ. 17,900 నుంచి 47,920 ఉంటుంది. ఫీజు: జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500గా నిర్ణయించారు. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2023 దరఖాస్తు ఫీజు చెల్లింపునకు తుది గడువు: అక్టోబర్ 21, 2023 ఎగ్జామ్ తేదీ: నవంబర్, 2023 అధికారిక వెబ్‌సైట్ - https://apcob.org/ ఇది కూడా చదవండి: నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. గుండెపోటు వచ్చే ఛాన్స్..! #rtvlive-com #jobs #latest-jobs #apcob-recruitment-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి