YS Sharmila: సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల.. మొదటిసారిగా సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. By B Aravind 12 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఈరోజు (సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాతా రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి. ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలాఉండగా.. గతంలో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే. Also read: మా పిల్లలను కుక్కలు, నక్కలుగా చూస్తున్నారు.. విద్యార్థుల ఆత్మహత్యలపై ఆర్ఎస్పీ ఆందోళన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది. @revanth_anumula pic.twitter.com/ac1CVr8ECK — YS Sharmila (@realyssharmila) February 12, 2024 ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి అప్పగించింది. మొన్నటివరకు తెలంగాణలో పాలిటిక్స్ చేసిన షర్మిల.. ప్రస్తుతం ఏపీలో తన రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై రాజకీయంగా విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టేసింది. అయితే ఈసారి జరగనున్న ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. Also Read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా! #revanth-reddy #telangana-news #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి