ATM Gang: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు తిరుపతిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఆరుగురు హర్యానాకు చెందిన గ్యాంగ్ నేరగాళ్లగా పోలీసులు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. By Vijaya Nimma 13 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానా దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ మేరకు తిరుపతిలో జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏ విధంగా దొంగతనాలు చేస్తున్నారు.. ఎలా వారిని అరెస్ట్ చేశారో చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇది కూడా చదవండి: ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేస్తే జరిగేది ఇదే బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టారు.. తిరుపతి రూరల్ ధనలక్ష్మినగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో గత నెల (సెప్టెంబర్ 14)వ తేదీ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంరెడ్డి, రాజశేఖర్లు బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఏటీఎంలో దొంగతనాలు చేసింది మేవాత్ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. దీంతో హర్యానాకు చెందిన ఏటీఎం దొంగల ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేశారు. దీంతోపాటు 2 నాటు తుపాకులు, 2 లారీలు, కారు, 21 కేజీల గంజాయి, గ్యాస్ కట్టర్స్ పరికరాలు, 2 లక్షల నగదు మేవాత్ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలింపు కాగా.. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో మేవాత్ గ్యాంగ్‌పై19 కేసులున్నాయని పోలీసులు గుర్తించారు. ముఠాలో ప్రధాన ముద్దాయి సద్దాంఖాన్‌పై వివిధ రాష్ట్రాల్లో 23 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం దొంగతనాలతో పాటు గంజాయిని కూడా ఈ ముఠా విక్రయించిందన్నారు. ఈ దందా కూడా తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో తక్కువ డబ్బులకు కొనుగోలు చేసి హర్యానాలో ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని ఇద్దరు సభ్యులు అమీర్ ఖాన్, రహాడి సద్దాంలు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ పరమేశ్వరరెడ్డి చెప్పారు. అయితే ఈ కేసులో ఏటీఎం అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులైన నిందితులను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నందుకు తిరుపతి రూరల్ పోలీసులకు రివార్డులు అందజేసినట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో) #arrested #haryana #atm-gang #mewat-gang #dhanalakshminagar #sbi-atm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి