Andhra Pradesh: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి: అయ్యన్నపాత్రుడు

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు.

Andhra Pradesh: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి: అయ్యన్నపాత్రుడు
New Update

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.'' గత ఐదేళ్లుగా రాష్ట్రం దోపిడీదారుల వల్ల నాశనమైంది. ఏ పార్టీకైనా నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి.

Also Read: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక!

ప్రతి అంశంపై చర్చ జరగాలి. అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుంది. నాయకుల లక్ష్యం ఏంటి అనేది వారికి అర్థమవుతుంది. అన్ని పార్టీలకు చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని'' అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.

Also read: వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీద్‌ను చంపిందెవరు?

#andhra-pradesh #ap-assembly #ayyanna-patrudu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe