Undavalli Sridevi and Mekapati Chandrasekhar: ఎన్నికల ముందు వైసీపీకి షాక్ లు తగులుతున్నాయి. రీసెంట్ గా పార్టీలో అంతర్గత మార్పులతో చిన్నపాటి కల్లోలం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ కొడుతున్నారు. తాడికొండ వైసీపీ నేతలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఈరోజు టీడీపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి అనుచరులు, మరికొందరు తాడికొండ వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.వారే నేడు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వీరిద్దరితో పాటూ రామచంద్రపురం, తంబళ్లపల్లి, పెదకూరపాడు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాల నుంచి పెద్దల సంఖ్యలో అధికార పార్టీకి చెందినవారు టీడీపీలో చేరతారని చెబుతున్నారు.
Also Read:కొత్త అసెంబ్లీలో కాసేపట్లో గవర్నర్ ప్రసంగం..
మరోవైపు వైసీపీలో మార్పులు, చేర్పుల వల్ల ఆ పార్టీ లెక్కలు మారతాయని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరింత మంది నేతలు పార్టీని వీడుతారంటూ చెబుతున్నారు. 11 మందికి సీట్లు మార్చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్సఫర్లు ఉంటాయని తాను ఎప్పుడూ ఊహించ లేదన్నారు. అయితే ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతారు..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.