kadapa: చంద్రబాబు టికెట్ ఇస్తే మరోసారి గెలుస్తా: మేకపాటి చంద్రశేఖర్
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నేను కడపలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను. నేను కోరుకున్నది ఆయన చేశాడు. అందుకే మొక్కు తీర్చాను. మంచిగా ఉన్న చంద్రబాబు అరెస్టు అయినా వినాయకుని ఆశీస్సులతో బయటకు వస్తాడని ఆశిస్తున్నాను. చంద్రబాబు, నా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాని ఆయన అన్నారు.