/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/jagan-vs-cpi-ramakrishna-jpg.webp)
CPI Ramakrishna: సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జగన్ సీఎం (Jagan) అయ్యాక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అవినీతి పెరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో ఇసుక దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. అక్రమార్కులకే ప్రకృతి కూడా సహకరిస్తుందని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
సిఎం జగన్ తన వారికే ఇసుక అనుమతులు కట్ట బెట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఉచిత ఇసుక ఇస్తే తప్పని కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. మద్యం విషయంలో అన్యాయంగా ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. రాష్ట్రంలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తుందని తెలిపారు.
గతంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట మార్చి విశాఖ రాజధాని అనడం సిగ్గు చేటు కాదా? అని విమర్శించారు. రిషికొండను తవ్వి 450 కోట్లతో ప్యాలెస్ కట్టాడు జగన్ అని అన్నారు. ఇందులో జగన్ కి, సుబ్బారెడ్డికి 150 కోట్లు అవినీతి చేశారని.. తాడేపల్లి ప్యాలెస్ కి ఈ డబ్బు చేరిందని ఆరోపించారు.
వీటి పై సమగ్రంగా విచారణ చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం జరిగిందని అన్ని పార్టీలు చెబుతున్నాయని పేర్కొన్నారు. 2014 నుంచి నేటి వరకు మద్యం కంపెనీ అనుమతులపై విచారణ చేయాలని.. అప్పుడు జగన్ లో దురుద్దేశం లేదని ఒప్పుకుంటాం అని అన్నారు.
పేదల పార్టీ అంటూనే ఆ పేదల బతుకులను జగన్ నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటర్ల జాబితాలో కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వీటిపై ఆధారాలతో గవర్నర్ ను కలిసి వివరిస్తామని అన్నారు.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!