BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!

ఏపీలో ఒక కీలక అధికారి బదిలీకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ డీల్‌లో భాగంగా ఏపీలో కీలకంగా ఉన్న ఓ అధికారిని తిరిగి తన సొంత కేంద్రం సర్వీస్‌కు పంపుతారని సమాచారం. అటు ప్రధాని మోదీ అమరావతి వచ్చి స్వయంగా రైతులతో సభ పెట్టనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

New Update
BJP-TDP: టీడీపీ, బీజేపీ పెళ్లి.. రెండు అడుగులు వేయడానికి అంగీకారం!

BJP-TDP-JS Alliance: టీడీపీ-జనసేన-బీజేపీ ట్రైయాంగిల్‌ పొత్తుపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు కానీ.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏదో ఒక స్పష్టతైతే రావడం గ్యారెంటీ. సీట్ల పంపకాలు ఎలా ఉంటాయోనన్న చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీకి 145, జనసేనకు 21, బీజేపీకి 9 అసెంబ్లీ సీట్లు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. బీజేపీతో చర్చలకంటే ముందే సీట్లపై ఓ అవగాహన వచ్చినట్టుగా అనిపిస్తోంది. చంద్రబాబు, పవన్‌ భేటీలోనే బీజేపీకిచ్చే సీట్లపై చర్చ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమిత్‌షా ఇంటికి వెళ్లారు చంద్రబాబు. అమిత్‌షాతో భేటీలో చంద్రబాబు ఒక్కరే ఉంటారు. అమిత్‌షాతో భేటీ తర్వాత నడ్డాతోనూ చంద్రబాబు భేటీ ఉండగా ఇదే సమయంలో మరో విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది

రెండు అడుగుల పెళ్లి:
టీడీపీ, బీజేపీ పెళ్లితో ఏపీలో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. పెళ్లిలో తొలుత రెండు అడుగులు వేయడానికి అంగీకారం కుదిరినట్టుగా అర్థమవుతోంది.

--> తొలి అడుగు : ఒక కీలక అధికారి బదిలీ
--> రెండో అడుగు : అమరావతి రైతులతో మోదీ సభ

తొలి అడుగులో భాగంగా సొంత కేడరైన కేంద్ర సర్వీసు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీలో కీలకంగా ఉన్న అధికారిని మార్చనున్నారని తెలుస్తోంది. ఆయన్ను తిరిగి తన సొంత కేంద్రం సర్వీస్‌కు పంపుతారని సమాచారం. రెండో అడుగులో భాగంగా ప్రధాని మోదీ అమరావతి వచ్చి రైతులతో సభ పెడతారట. రాజధానిపై వారికి ప్రధానిగా భరోసా ఇస్తారట. ఈ రెండు కీలక పరిణామాలపై టీడీపీ, బీజేపీ మధ్య అంగీకారం కుదిరిందా లేదాఅన్నది కాసేపట్లో తేలిపోనుంది.

Also Read: కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!

WATCH:

Advertisment
తాజా కథనాలు