AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ట్విట్టర్ లో జరుగుతున్నట్లు అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి నేతలు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టే. ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షురాలు పురంధేశ్వరిపై విమర్శల దాడికి దిగారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai Reddy) . టీడీపీకి (TDP) కోవర్టుగా పురంధేశ్వరి వ్యవరిస్తోందని ఆరోపించారు విజయసాయి రెడ్డి.
ALSO READ: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి రైతుబంధు?
ఆయన ట్విట్టర్ లో.. 'చంద్రబాబు గారు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టిడిపి భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి గారి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!' అంటూ పురంధేశ్వరిపై చురకలు అంటించారు.
మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు గారు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. 1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా! దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ALSO READ: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
'కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది! పురందేశ్వరి గారి ఉవాచ! మరి కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా చెల్లమ్మా? మీ నాన్న ఎన్టీఆర్ గారు కేంద్రం ఒక మిథ్య అనేవారు - మీరు మాత్రం అంతా రివర్స్ లా ఉన్నారే ! అవునులే తండ్రిని వేధించిన పార్టీతోనే అంటకాగిన వ్యక్తివి కదమ్మా!' అని పురంధేశ్వరిపై విమర్శలు చేశారు విజయసాయి రెడ్డి.