Lokesh Yuvagalam: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగెట్టేందుకు టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇటీవల మొదటి విడత పూర్తి చేసుకున్న లోకేష్.. తాజాగా రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. దీనికి సంబంధించని షెడ్యూల్ తో పాటు పాటను టీడీపీ పార్టీ విడుదల చేసింది.
ALSO READ: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 10:19 నిమిషాలకు పాదయాత్ర ఆగిన చోట పొదలాడ నుండి లోకేష్ తిరిగి పాదయాత్ర చేయనున్నారని తెలిపారు.
మొదటిరోజు తాటిపాకలో బహిరంగ సభ, తనతో కలిసి నారా లోకేష్ 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. రెండవ రోజు అమలాపురం చేరుకుంటుందని తెలిపారు. టీడీపీ - జనసేన పొత్తు కలిసిన రోజు నుండే వైసీపీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ రావటం వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని సెటైర్లు వేశారు.
ALSO READ: రూ.15 లక్షలు వచ్చాయా?.. మోదీపై ఖర్గే చురకలు!
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, భువనేశ్వరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని పేర్కొన్నారు. దొంగ కేసులు పెట్టి 53 రోజుల్లో చంద్రబాబుపై ఒక్క సాక్ష్యం కూడా నిరూపించలేక ప్రభుత్వం నవ్వుల పాలయిందని విమర్శించారు. ఈ మూడు నెలలు ముప్పేట దాడి చేస్తూ ఉంటామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.