ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది: బొత్స!

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తన ట్విట్టర్‌ ఖాతాలో టీడీపీ మీద విరుచుకుపడ్డారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్‌ సైట్ నుంచి తొలగించి పారిపోయిన ప్రభుత్వం మాది కాదు అంటూ గత ప్రభుత్వం గురించి ఆయన ఎద్దేవా చేశారు.

ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది: బొత్స!
New Update

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో అధికార పక్ష నేతలు విపక్షాల మీద రోజూ ఏదోక రూపంలో విరుచుకుపడుతూనే ఉన్నారు. సోషల్‌ మీడియాల్లో కూడా ఒకరి మీద ఒకరు ట్వీట్ల రూపంలో విరుచుకుపడుతూనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన ట్వీట్‌ ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ ట్వీట్‌ బొత్స ఈ విధంగా రాసుకొచ్చారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్‌ సైట్ నుంచి తొలగించి పారిపోయిన ప్రభుత్వం మాది కాదు అంటూ గత ప్రభుత్వం గురించి ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1.4 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని పేర్కొన్నారు.

ఐదేళ్ల కాలంలో కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం మాది కాదు ఇది నాలుగున్నరేళ్లలో బాబు కంటే ఏడింతలు మెరుగ్గా 2.14 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ది చాటుకున్న ప్రభుత్వం మాది అంటూ తెలిపారు. ''నిరుద్యోగులకు రూ.2 వేలు భృతి ఇస్తామని చెప్పి, ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీ కార్యకర్తలకు రూ. 1000 ఇచ్చి వంచించిన ప్రభుత్వం కాదు ఇది అంటూ పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి యువతను సమాజ సేవలో భాగం చేసిన ప్రభుత్వం ఇది. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు ప్రపంచ స్థాయి విద్యను దగ్గర చేశాం. పోటీప్రపంచంలో ఉద్యోగాలు పొందేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తోన్న ప్రభుత్వం ఇదని గర్వంగా చెబుతున్నాం. దీంతో పాటుగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంది. కరోనా కష్టంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఎల్లో మీడియా మాయలో మోసం చేసే వ్యక్తులను నమ్మవద్దని ప్రజలకు మనవి చేస్తున్నాను. '' అంటూ ట్విట్టర్‌ లో రాసుకొచ్చారు.

Also read: ఇక పై మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల్లో భయం భయం

#ycp #tdp #botsa-satyanarayana #twitter #ap-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe