Andra Pradesh: మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జాబ్స్‌ను అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్ంత 189 ఖాళీలకు జాబ్స్ అనౌన్స్ చేసింది. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు 102, స్టాఫ్ నర్స్ ఖాళీలు 87 ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. అర్హులైన అభ్యర్ధులు APMSRB అధికారిక పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. apmsrb.ap.gov.in లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఫిబ్రవరి 28న అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అయింది. మార్చి 10తో ముగుస్తుంది. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
మెడికల్ ఆఫీసర్ పోస్టులకు కచ్చితంగా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అంతేకాదు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇక స్టాఫ్ నర్సుల జాబ్‌కు అయితే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి GNM/B.Sc.(Nursing) చదివి ఉండాలి. అలాగే ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు ఎప్పటికప్పుడు సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 27675 నుంచి రూ.61,960 మధ్య ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు (UPHCs) & అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (UAAMs)ల్లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్షను నిర్వహిస్తారు. దాని తరువాల డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు.
అప్లై చేసుకునే విధానం..
APMSRB అధికారిక పోర్టల్ apmsrb.ap.gov.in లో అప్లికేషన్ ఫిలస్ చేసుకోవాలి. ఇందులో హోమ్ పేజ్‌లోకి వెళ్ళి మెడికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపాలి. ముందుగా పర్శనల్ వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి అన్ని వివరాలను నింపాలి. ఫీజు చెల్లించి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫారమ్ సబ్ చేయాలి.
ఫీజు...
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఓసీ అభ్యర్థులు అయితే రూ.1000 ... బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ. 500 కట్టాలి. స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఓసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ.400 ఉంటుంది.
Also Read:Andhra Pradesh : అనపర్తిలో పొలిటికల్ వార్.. టెన్షన్.. టెన్షన్