AP high court lawyer:చంద్రబాబు విడుదల ఎప్పుడంటే.. సంచలన విషయాలు చెప్పిన లాయర్ ఈ రోజు సాయంత్రంలోగా చంద్రబాబు విడుదల అవుతారని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒక వేళ ఆలస్యం అయితే.. రేపు ఉదయం విడుదల అవుతారని వెల్లడించారు. భవిష్యత్ లో మిగతా అన్ని కేసుల విషయంలోనూ చంద్రబాబుకు తప్పుకుండా ఊరట లభిస్తుందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Manogna alamuru 31 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ (Chandrababu Bail) ఇవ్వడంతో ఆయన తరఫు లాయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులతో ఆర్టీవీ మాట్లాడింది. ఆర్డర్ కాపీ రెడీ అవుతోందని...ఈరోజు సాయంత్రానికి చంద్రబాబు బయటకు వచ్చేస్తారని చెప్పారు. ఒకవేళ ఆర్డర్ కాపీ జైలుకు చేరడం లేటు అయితే రేపు ఉదయం ఆరు గంటల కల్లా వస్తారని స్పష్టం చేశారు. ఇక మీదట చంద్రబాబు మీద ఉన్న అన్ని కేసుల్లో ఆయనకు రిలీఫ్ దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు దేనిలోనూ తప్పు చేయలేదు. ఆల్రెడీ కొన్ని కేసుల్లో బెయిల్ ఉంది. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఏది చేసినా న్యాయపరంగా వెళ్ళారని అంటున్నారు లాయర్లు. ఈ కేసులు కేవలం ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి మాత్రమే పెట్టారని ధ్వజమెత్తారు. ఇవేవీ నిలబడవు. ఆయనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేశారని చెబుతున్నారు. Also Read:చంద్రబాబుకు బెయిల్..కండిషన్లు ఇవే మరోవైపు చంద్రబాబు మీద పెట్టిన లిక్కర్ కేసు మీద మండిపడుతున్నారు హైకోర్టు లాయర్లు. అదొక పనికిమాలిన కేసు అని కొట్టిపారేశారు. చంద్రబాబు మీద ఈ విషయంలో కేసు వేస్తే గవర్నమెంటులో ఉన్న అందరి మీదా కేసులు వేయాలన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పని మాఫియానే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పూర్తి ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో చూడండి. #chandrababu #ap-high-court #bail #lawyers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి