NARA LOKESH:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట అభించింది. ఈ కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసేసింది. లోకేష్ ను ముద్దాయిగా కేసులో చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా లేని వారిని అరెస్ట్ చేయమని కూడా చెప్పింది. By Manogna alamuru 12 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఈ రోజు విచారించిన కోర్టు కేసును క్లోజ్ చేస్తున్నామంటూ తీర్పును ఇచ్చింది. ఇంతకు ముందు హైకోర్టు జరిపిన విచారణలో గురువారం వరకు లోకేష్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ కోర్టులో ఇరుపక్షాలు తమ వాదనలను వినిపించాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది. ముద్దాయిగా చూపని కారణంగా అతనిని అరెస్ట్ చేయమని చెప్పింది. ఒకవేళ కేసులో లోకేష్ పేరు చేర్చినా 41ఏ నిబంధనలు అనుసరిస్తామని చెప్పారు సీఐడీ తరుఫు లాయర్లు. అనంతరం ఉన్నత న్యాయస్థానం కేసును డిస్పోజ్ చేస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. దీంతో నారా లోకేష్ కు రిలీఫ్ దొరికినట్టు అయింది. మరోవైపు అంగళ్ళ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ పూర్తయింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం అంటే రేపు తీర్పును చెబుతామని కోర్టు తెలిపింది. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల తాలూకు ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ గతంలోనే ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. చంద్ర బాబు రేచ్చగోట్టే వ్యాఖ్యల చేశాడని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాన్ని పెన్ డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు మీద ఫిర్యాదును ఆలస్యంగా చేశారని బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఘటన పై ఆలస్యంగా ఫిర్యాదు చేసినా జరిగిన ఘటనలు మొత్తాన్ని కంప్లైంట్ లో తెలిపామన్నారు సుధాకర్ రెడ్డి. Also Read:అమిత్ షాతో నారా లోకేష్ భేటీ.. పురందేశ్వరి మాస్టర్ ప్లాన్ ఇదేనా? ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన #nara-lokesh #high-court #and-andhra-pradesh #skill-developement-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి