APPSC : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం(APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీలను భర్తీ చేయనుండగా నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి పరీక్షలు జరగనున్నాయి.
ఇక ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా అసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అవకాశం కల్పించింది ఏపీపీఎస్సీ.
ఇది కూడా చదవండి : Etela Rajendar : మల్కాజ్‌గిరి ఎంపీ సీటుపై ఈటల కన్ను.. టికెట్ ఇవ్వకపోతే?
అలాగే ఇందుకు సంబంధించిన పరీక్షలు 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష జరగనుండగా నూతన సిలబస్, నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక పరీక్షల్లో ఉత్తి్ర్ణులైన అభ్యర్థుల లిస్ట్ లో మెరిట్ మార్కుల ఆధారంగా మెయిన్ మెయిన్ ఎగ్జామ్ కు షార్ట్ లిస్ట్ తీస్తారు. ఇక తుది పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహించనుండగా.. ఇంకా ఆ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి స్క్రీనింగ్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్స్ రెండూ ఆఫ్ లైన్ మోడ్(OMR) అబ్జె్క్టివ్ విధానంలోనే నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
ఇదిలావుంటే ఏపీ గవర్నమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు పలు కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. పలు శాఖల్లోనూ ఖాళీలను భర్తీ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పది, ఇంటర్ పరీక్ష తేదీలను కూడా విడుదలయ్యాయి. ఇటీవలే విద్యా శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
అధికారిక వెబ్ సైట్ : https://psc.ap.gov.in/