Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్. మార్చి 17 ఈ పరీక్ష జరగనుంది. ఉదయం పదినుంచి పన్నెండు వరకు ఒక పేపర్...మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు రెండో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

New Update
Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

AP Group - 1 Exam : మార్చి 17 జరగబోయే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఈరోజు విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్. పరీక్షా కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకుంటే ఎలాంటి ఇబ్వంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని తెలిపింది. psc.ap.gov.in అధికారిక పోర్టల్‌ నుంచి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. APPSC గ్రూప్-1 రిక్రూట్‌మెంట్-2024(APPSC Group-1 Recruitment-2024) డ్రైవ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మార్చి 17న ఎగ్జామ్:
APPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మార్చి 17న జరగనుంది. ఆఫ్‌లైన్ పరీక్ష పేపర్ 1 (ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు), పేపర్ 2 (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) రెండు షిఫ్టులలో జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష జరగనుంది. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులవుతారు. మొత్తం 81 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

అడ్మిట్ కార్డ్ 2024ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

స్టెప్ 1: ముందుగా APPSC అధికారిక పోర్టల్‌ psc.ap.gov.in ని విజిట్ చేయండి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో APPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్-2024 డౌన్‌లోడ్ లింక్‌ను సెర్చ్ చేయండి.

స్టెప్ 3: లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను పూరించండి.

స్టెప్ 5: లాగిన్ ఆధారాలను సమర్పించండి

స్టెప్ 6: APPSC హాల్ టిక్కెట్ 2024 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.

స్టెప్ 7: భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్(Download Hall Ticket) చేసి ప్రింటవుట్ తీసుకోండి.

Also Read : Telangana : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్..కాంగ్రెస్‌లోకి ఇంద్రకరణ్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు