Vote-on-Account Budget: నేడు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. By B Aravind 07 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర సర్కార్ నేడు (బుధవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే ఈ ఏడాది అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి మూడు నెలల వ్యయానికి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు... ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదానికి సభలో ఆమోదించనున్నారు. Also Read: మచ్చలేని అధికారిని.. అవినీతి ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి అదే సమయానికి శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను చదువుతారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ఆర్థిక శాఖ అధికారుల పూజలు చేశారు. అయితే మొత్తం బడ్జెట్ రూ. 2.85 లక్షల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. Also read: ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్.. తెలంగాణలో కేసు నమోదు! #telugu-news #ap-politcs #budget #ap-budget మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి