Andhra Pradesh: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. మంత్రుల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డినెన్స్‌కు ఆమోదం తీసుకుంది. తర్వాత దాన్ని గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది.

BREAKING: ఏపీకి ఐపీఎస్‌ కేడర్‌ స్ట్రెంత్‌పై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌
New Update

ఆంధ్రాలో గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పరిమితి ఇవాల్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ప్రస్తుత ప్రభుత్వం ఆమోదం తీసుకుంది. దీనికి ముంత్రుల నుంచి ఆన్‌లైన్‌లో ఆమోదం తీసుకుంది. తర్వాత దాన్ని ఆమోదం కోసం గవర్నర్ దగ్గరకు పంపించింది. సెప్టెంబర్‌లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.దాదాపు రూ.1.30లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ ఇచ్చింది.40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం వచ్చేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సు జీవో జారీ చేసింది. అన్నా క్యాంటీన్ల నిర్మాణం, రోడ్ల రిపేర్లు సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు.

వీటితో పాటూ రోడ్ల మరమ్మత్తులకు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు మొదలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా జరుగుతున్నాయి. ఇక వీటన్నింటతో పాటూ కేంద్ర ప్రభుత్వం అందించించే పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించినట్టు సమాచారం.

ఇప్పుడు ఓటాన్ బడ్జెట్‌కు ఆమోదం లభిస్తే కనుక ఒక ఏడాదిలో రెండు సార్లు దీనిని ప్రవేశపెట్టినట్టు అవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి కూడా అవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం మారడంతో రాషట్ర ఆర్ధిక పరిస్థితి మీద అవగాహన రావడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు భావిస్తున్నారు. అందుకే సెప్టెంబర్‌లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Also Read:TGPSC: జనవరిలో సీడీపీవో, ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్

#andhra-pradesh #government #budget #vote-on-acount
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe