Andhra Pradesh : ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం. విదేవాలకు వెళ్ళి చదువుకోలేని విద్యార్ధుల కోసం అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకుంది.

New Update
Andhra Pradesh : ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఎడెక్స్ ప్రోగ్రామ్ ప్రారంభం

EdX Program : విద్యావిధానంలో మార్పులు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వై ఎస్ జగన్(YS Jagan). రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధుల కోసం అంతర్జాతీయ యూనివర్శిటీల కోర్పులను(International University Courses) ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టారు. దీని కోసం ఎడెక్స్ అన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రాం(EdX Online Learning Program) ను ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ వంటి ఎన్నో పెద్ద పెద్ద యూనివర్శిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. దాని తర్వాత మంచి జీతాలతో జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా కూడా ఎడెక్స్ ప్రోత్సహిస్తుంది.

Also Read : Manipur Violence : మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి!

12 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి...

ఎడెక్స్‌లో సుమారు 2 వేలకు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎడె­క్స్, ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లె­ర్నింగ్‌ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. ఎడెక్స్‌లో ప్రపంచంలోని అత్యున్నత స్థాయి యూనివర్శిటీలు, సంస్థలకు చెందిన లెక్చరర్లు, టీచర్లతో బోధన ఉంటుంది. ప్రపంచంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు సామాజిక, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులను పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు.

విదేశాలకు వెళ్ళి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్ధులు కావాల్సిన కోర్పులను ఇందులోనే పూర్తి చేయవచ్చును. కోర్పులు అయ్యాక అంతర్జాతీయ వర్శిటీలో అన్‌లైన్ ఎగ్జామ్(Online Exam) నిర్వహించి సర్టిఫికెట్లు కూడా ఇస్తాయి. దీని వలన విద్యార్ధులు గ్లోబల్ స్టూడెంట్స్‌గా ఎదుగుతారు.

Advertisment
తాజా కథనాలు