Free Tabs For AP Students: జగన్ సర్కార్ ఏపీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఈ నెల 21 తేదీ నుంచి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ (Free Tabs Scheme) చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఏడాది విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే 25ఏళ్ల వరకు వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandra Babu) విమర్శల దాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుపు కోసమే ఇంఛార్జిలను మార్చినట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన సీట్లలో అందరూ గెలిచారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రతీ పార్టీలో జరిగే ప్రక్రియ తమ పార్టీలో కూడా జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం టీడీపీని పార్టీని ఓడించి.. ప్రజలు వైసీపీ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. కుప్పం సిట్ లో చంద్రబాబు విజయానికి గ్యారెంటీ లేదని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అన్నారు. చెల్లని నాణెం చంద్రబాబు గతంలో 175మంది పోటీ చేస్తే ఏం అయిందో చూసాం అని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి ఎందుకు ఓటు వేయకొడదో ఒక్క మాట చెప్పండి అని చంద్రబాబును ప్రశ్నించారు.
ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!
అనేక పథకాలు, హాస్పటల్స్, పాఠశాలలో మార్పలు చూస్తే తెలుస్తుంది వైసీపీ పాలన ఏంటో అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. విడతల వారీగా మధ్యపానం చేస్తాము అన్నాము.. బెల్ట్ షాప్స్ లేవు.. పేద వాడికి మద్యం అందకుండా త్వరలో చేస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ మార్చిన 11 మందిలో 2 సీట్లు కొత్తవారికి ఇచ్చాము ఇద్దరు కూడా బీసీ అభ్యర్థులే అని తెలిపారు. ఆశా వర్కర్స్ కి వైసీపీ ప్రభుత్వం వల్ల మంచి లబ్ధి జరిగిందని.. వాళ్ళ నిరసన పట్ల ఒకసారి వాళ్లే అర్ధం చేసుకోవాలని కోరారు.