CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని.. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

CBN : 'అహంకారంతో విర్రవీగితే...' తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!
New Update

Chandrababu's Harsh Comments on Telangana Election Results : తెలంగాణ(Telangana) ఎన్నికలపై ఈ సారి ఏపీ రాజకీయ నాయకులు, సామాన్యులు ఫుల్‌గా ఇంట్రెస్ట్ చూపించారు. అటు ఏపీకి చెందని జనసేన పార్టీ తెలంగాణలోని 8జిల్లాల్లో పోటి కూడా చేసింది. అటు ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా పోటి చేయాలని భావించినా ఆఖరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే కాంగ్రెస్‌ ప్రచారాల్లో ఈ సారి టీడీపీ జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)నేరుగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు కానీ తెలంగాణలోకి టీడీపీ క్యాడెర్‌ ఈసారి కాంగ్రెస్‌ జెండాలు మోసిందన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం తమ్ముళ్లు సంబరాలు చేసుకున్న వీడియోలు నెటింట్లో వైరలైన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి.

WATCH:

చంద్రబాబు ఏం అన్నారంటే?
తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు స్పందించారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామంటూ పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేసినట్లు అర్థమవుతోంది. మరో 3 నెలల్లో ఏపీలో కూడా అదే చూడబోతున్నామని చంద్రబాబు కామెంట్స్ చేశారు.

ఇక తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్‌ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ఏపీ టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించకున్నాయి.

Also Read: కొత్త సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ..మరి కాసేపట్లో ఢిల్లీకి ప్రయాణం

#kcr #chandrababu-naidu #jagan #telangana-elections-2023 #andhra-paradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe