Mudragada : వైసీపీలోకి ముద్రగడ.. పవన్‌పై పోటికి సై?

ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తుండగా.. జనసేనానిపై పోటికి ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Mudragada : వైసీపీలోకి ముద్రగడ.. పవన్‌పై పోటికి సై?
New Update

AP Politics : ఏపీ(AP) లో కాపులు, కాపు నేతల చుట్టూ రాజకీయాలు గిర్రున తిరుగుతున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఏ క్షణంలోనైనా వైసీపీ(YCP) కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టే కాసేపట్లో ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ముద్రగడతో కాకినాడ పరిధిలోని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు భేటీ అవనున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వంగా గీత, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ద్వారంపూడి, ఇతర నేతలు ముద్రగడతో భేటీ కానుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడను ఈ నేతలంతా కలిసి వైసీపీలోకి ఆహ్వానించనున్నారు.

పవన్‌పై పోటికి దింపుతారా?
నిజానికి ముద్రగడ జనసేన(Janasena) లోకి వెళ్తారని ముందుగా ప్రచారం జరిగింది. వైసీపీ నేతలతో అసలు మాట్లాడేందుకే ముద్రగడ ఇష్టపడలేదని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. స్వయంగా పవన్ ముద్రగడను జనసేనలోకి ఆహ్వానిస్తారని జోరుగా చర్చ జరిగింది. అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ ఓ బహిరంగ సభలో పవన్‌ ముద్రగడను టార్గెట్ చేసేలా మాట్లాడారు. ఇక ఆ తర్వాత జనసేనకు టీడీపీ 24 సీట్లే ఇవ్వడంతో కాపు నేతలు పవన్‌పై రివర్స్ అయ్యారు. ఆ క్రమంలోనే మరో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సైతం వైసీపీలోకి చేరగా... ఇక తాజాగా ముద్రగడ కూడా జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధమయ్యాయరని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కు పోటిగా ముద్రగడను దింపేందుకు వైసీపీ పావులు కదుపుతోంది.

ఏపీ రాజకీయాల్లో(AP Politics) కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువని తెలిసిందే. దీంతో పవన్‌కు పోటీగా బలమైన కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.

Also Read : పొత్తు లేనట్టేనా? తేల్చేసిన పురందేశ్వరి!

#pawan-kalyan #ycp #ap-elections-2024 #mudragada #general-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe