Jayaho BC: 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్.. టీడీపీ-జనసేన కీలక ప్రకటన

బీసీ డిక్లరేషన్‌ పోస్టర్లను టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో ఆవిష్కరించారు. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

New Update
Jayaho BC: 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్.. టీడీపీ-జనసేన కీలక ప్రకటన

TDP- Janasena BC Declaration: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ పోస్టర్లను టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ఆవిష్కరించారు. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మొదటిగా 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4000 పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

బీసీ డిక్లరేషన్ లోని హామీలు..

* పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటన
* బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌, పెన్షన్‌ రూ.4 వేలకు పెంపు
* బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం
* బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు
* స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
* రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం, చట్టబద్దంగా కులగణ
* రూ.10 లక్షలతో చంద్రన్న బీమా
* పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
* షరతులు లేకుండా విదేశీ విద్యా పథకం

BC DECLARATION

ALSO READ: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉంది: చంద్రబాబు

బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని చంద్రబాబు అన్నారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాం అని పేర్కొన్నారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ.. టీడీపీ అని అన్నారు. బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని వ్యాఖ్యానించారు. జగన్‌ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ తగ్గించారని అన్నారు. రిజర్వేషన్‌ తగ్గించడం వల్ల చాలా మంది బీసీలు పదవులు కోల్పోయారని అన్నారు. ఎవరికైనా పదవులు దక్కకుంటే నామినేటెడ్‌ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలని అన్నారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు.

157 కులాలకు న్యాయం చేస్తాం..

బీసీల దశ, దిశ మార్చడం కోసమే బీసీ డిక్లరేషన్‌ ఇచ్చామని అన్నారు. బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు.. నాగరికతకు వారే మూలం.. చెరువులు, దోబీఘాట్‌లపై మళ్లీ హక్కు కల్పిస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిశ్రమలు పెట్టేలా కురబ, యాదవులను ప్రోత్సహిస్తాం అని అన్నారు. యాదవుల జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు. బీసీల్లో ఉన్న 157 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు