KA Paul At CM Jagan Residence: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA Paul) ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను (CM Jagan) కలిసేందుకు తాడేపల్లిలో సీఎం క్యాంపు నివాసానికి (Tadepally CM Camp Office) వెళ్లారు. అయితే సీఎంను కలిసేందుకు అనుమతి లేదంటూ KA పాల్ ను క్యాంపు కార్యాలయం లోకి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్, పోలీసుల నడుమ వాగ్వాదం నడిచింది. సీఎం జగన్ ను కలిసే వరకు తాను వెనక్కి వెళ్లానని కేఏ పాల్ సీఎం క్యాంపు కార్యాలయం వెళ్లే రోడ్డు మెయిన్ గేట్ వద్ద చాలా సమయం వేచి చూశారు. ఎంత సమయం ఎదురుచూసిన సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో కేఏ పాల్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
ALSO READ: సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు...
తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు కేఏ పాల్. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు పడుతున్న సమస్యలను సీఎం జగన్ కు వివరించేందుకే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చానని కేఏ పాల్ అన్నారు. ప్రజా సమస్యలపై సీఎం తో చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వచ్చానని.. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఈ రోజు అంత వేచి చూస్తానని పాల్ తెలిపారు.
ఇస్తే దీవిస్తా.. లేదంటే జగన్ ను శపిస్తా..
సీఎం జగన్ తాను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా అని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది దేశాధి నేతలు తాను అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సైతం తనకు అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ (KCR) సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదు.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని అన్నారు. మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చిన పరిస్థితి చూశారని.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం సీఎం అయ్యాక తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.
జగన్ మాజీ సీఎం అవుతారు..
సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తానని అన్నారు కేఏ పాల్. అపాయింట్ మెంట్ ఇస్తే సీఎం తో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తా, రహస్యాలు చెబుతా అని పేర్కొన్నారు. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు పాల్. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో 75 సీట్లు గెలుస్తారో.. 25 సీట్లు గెలుస్తారో తనకు తెలియదని అన్నారు.