Pawan Kalyan: పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?.. చీఫ్ సెక్రెటరీపై పవన్ ఫైర్

ఏపీలో పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చురకలు అంటించారు. పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఉద్యోగులు లేరా? అని నిలదీశారు.

Pawan kalyan: కాబోయే ప్రధాని ఆయనే.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
New Update

Pawan Kalyan: ఏపీలో పెన్షన్ల పంపిణీపై సీరియస్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ నిలదీశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారని ఫైర్ అయ్యారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? అని అడిగారు. కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చురకలు అంటించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయని అన్నారు.

ALSO READ: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు

జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు..

"జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి.. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను." అని అన్నారు.

అనారోగ్యంతో పవన్ పర్యటన వాయిదా..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయనకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత తెనాలి విచ్చేసి వారాహి సభలో పాల్గొంటానని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

#pawan-kalyan #cm-jagan #janasena #ap-pensions #ap-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe