Vangaveeti Radha Krishna : ఎన్నికలు(Elections) దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంగవీటి రాధా(Vangaveeti Radha) ను తిరిగి వైసీపీ(YCP) లో చేర్చుకునేందుకు కృష్ణా జిల్లా(Krishna District) నేతలు మంతలను జరుపుతున్నారు. ఈ క్రమంలో వంగవీటిని వైసీపీ మాజీ మంత్రులు భేటీ అయ్యారు. నిన్న (మంగళవారం) వంగవీటి రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని సమావేశం అయ్యారు. వైసీపీలో చేరాలని వారు వంగవీటి రాధాన్నీ కోరినట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బందరు(Bandhar) నుంచి పోటీ చేయాలని రాదాకు వారు సూచనలు చేసినట్లు సమాచారం.
ALSO READ: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి
ఇదిలా ఉండగా.. వైసీపీకి దూరమైన వంగవీటి రాధా టీడీపీలో చేరాలని మొదటగా భావించాడు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. విజయవాడ సెంట్రల్, లేదా విజయవాడ ఈస్ట్ టికెట్ ఆశించిన వంగవీటి రాధా ఆశలకు గండి కొట్టారు చంద్రబాబు. ఆ రెండు స్థానాల్లో వేరే అభ్యర్థులను కేటాయించారు. దీంతో వైసీపీలో బెంగపడ్డ వంగవీటి రాధాను టీడీపీలో చేరకముందే ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
టికెట్ రాలేదని నిరాశ చెందిన వంగవీటి రాధా తిరిగి వైసీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ పెద్దలకు చేరేందుకు సంకేతాలు కూడా చేస్తున్నట్లు కృష్ణా జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మరి వంగవీటి రాధా ఎప్పుడు వైసీపీలో చేరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అసలు ఆయన వైసీపీలో చేరుతారా? లేదా సైకిల్ ఎక్కుతారా? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది.