Lokesh: ఓటమి భయంతోనే చంపుతున్నారు.. వైసీపీపై లోకేష్ ఫైర్!

ఓటమి భయంతో మునయ్యని వైసీపీ సైకోలు మట్టుబెట్టారని ఆరోపించారు లోకేష్. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని అన్నారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు.

Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్
New Update

Nara Lokesh Slams CM Jagan: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా పాముల మునయ్య మరణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఇది వైసీపీ చేసిన రాజకీయ హత్య అని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీని దెబ్బ తీసేందుకు ఇలాంటి దుశ్చర్యలకు సీఎం జగన్ పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

ALSO READ: టికెట్ రాలేదని పురుగుల మందు తగిన టీడీపీ నేత

ఓటమి భయమే..

జగన్ గొడ్డలి పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయిందని అన్నారు. ఓటమి భయంతో మునయ్యని వైసీపీ సైకోలు మట్టుబెట్టారని ఆరోపించారు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం అని పేర్కొన్నారు. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారని ఆరోపించారు.

బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కి, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులని అన్నారు. మునయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దోషులను చట్టం ముందు నిలబెడతాం అని హామీ ఇచ్చారు.

ఏపీ గంజాయి వనం..

అమరావతిలోని అపార్టుమెంట్‌ వాసులతో మూడో రోజు నారా లోకేష్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని అపర్ణ అపార్టుమెంట్‌ వాసులతో లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖాముఖి అయ్యారు. ఏ సీఎం అయినా పాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారని.. జగన్‌ మాత్రం ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారను ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లూ ఇదే విధ్వంస పాలన కొనసాగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల రాష్ట్రవ్యాప్తంగా గంజాయి అమ్మకాలు విస్తరించాయని ఆరోపించారు. అధికారంలోకి రాగానే కూకటివేళ్లతో గంజాయిని పెకలించేస్తాం అని స్పష్టం చేశారు.

#nara-lokesh #tdp #ap-elections-2024 #cm-jagan #mlc-ananth-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe