TDP-JS Alliance: టీడీపీ, జనసేన మధ్య తేలని సీట్ల లెక్క.. ఈ స్థానాల్లో తీవ్ర పోటి!

పవన్‌ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు పార్టీల నేతల మధ్య మొత్తం 40స్థానాల్లో పోటి నెలకొంది. సంబంధిత నియోజకవర్గాల లిస్ట్ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Chandrababu: పొత్తులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. పవన్‌కు షాక్?

TDP-JanaSena Seat Sharing: టీడీపీ, జనసేన మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. చంద్రబాబు, పవన్‌ ఓకే అనుకున్నా గ్రౌండ్‌ లెవల్‌లో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 35 నుంచి 40 సీట్లలో టీడీపీ, జనసేన మధ్య పోటీ ఉంది. తామే పోటీ చేస్తామని ఇరు పార్టీ నేతల పట్టు పడుతున్నారు. ఏ జిల్లాల్లో పోటీ ఉందో కింద చూడండి.

---> శ్రీకాకుళం జిల్లా : పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస
---> తూ.గో.జిల్లా : రాజమండ్రి రూరల్‌, కాకినాడ రూరల్‌, కాకినాడ టౌన్‌...
---> తూ.గో.జిల్లా : పిఠాపురం, ముమ్మడివరం, అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం
---> ప.గో.జిల్లా : తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, ఉంగుటూరు, ఏలూరు
---> కృష్ణాజిల్లా : పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్‌, విజయవాడ ఈస్ట్‌
---> గుంటూరు జిల్లా : తెనాలి, గుంటూరు వెస్ట్‌
---> ప్రకాశం జిల్లా : చీరాల, దర్శి
---> నెల్లూరు జిల్లా : నెల్లూరు సిటీ, కోవూరు
---> కర్నూలు జిల్లా : ఆళ్లగడ్డ, ఆదోని
---> కడప జిల్లా : కడప సిటీ, రాజంపేట
---> అనంతపురం జిల్లా : అనంతపురం, ధర్మవరం
---> చిత్తూరు జిల్లా : జీడీ నెల్లూరు, మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి

ఇక పవన్‌ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల చంద్రబాబు, పవన్ ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించారు. అరకు, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు ఖరారు చేయడంతో రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల మధ్య చిచ్చు రేగింది.

Also Read: బాబును సీఎం చేయడమే నీ పనా? పవన్‌కు హరిరామ ఘాటు లేఖ!

Advertisment
తాజా కథనాలు