AP Elections 2024
ఏపీలో ఎన్నికల రోజు తమకు డబ్బులు అందలేదని అనేక చోట్ల ప్రజలు నాయకుల నివాసాల వద్ద ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలు(AP Elections 2024) ముగిసిన తర్వాత సైతం ఈ తరహా ఆందోళనలు ఆగడం లేదు. డబ్బుల పంపకాల్లో సమన్యాయం చేయలేదంటూ సొంత పార్టీ నాయకులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలవరం(Polavaram)లో జరిగిన ఈ వివాదం చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన కార్యకర్తల అందోళన చేశారు. పోలింగ్ ముగిసినా డబ్బు పంపిణీ గోల తెగలేదు.
Read Also: మోదీ అబద్దాలకోరు: ఎంపీ జైరాం రమేష్
టీడీపీ, జనసేన మండల ప్రెసిడెంట్లు తమ చుట్టుపక్కల వారికే డబ్బులు పంచి మిగతా వారికి ఎగనామం పెట్టారని కార్యకర్తల ఆందోళన చేపట్టారు. పోలవరం జనసేన మండల ప్రెసిడెంట్ ఇంటి దగ్గర ఈ రోజు ఈ వివాదం జరిగింది. డబ్బులు పంచకపోవడంతో ఓటర్లు తమను నిలదీస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే సీటును స్వలాభం కోసం పణంగా పెట్టారంటుటూ ఫైర్ అయ్యారు కార్యకర్తలు. దీంతో డబ్బులు పంపిణీ పంచాయితీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.