ఓటర్ పల్స్ పట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ! ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. By Bhavana 16 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.. బ్యాక్ రూమ్ ఏర్పాటు చేసిన ఈ టీం ఎన్నికల సంబంధించిన కీలక వ్యవహారాలు చూడబోతున్నట్లు సమాచారం.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టయి జైల్లో ఉన్నప్పటికీ... ఆ పార్టీ ఎన్నికల వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తుంది.. చంద్రబాబు అరెస్ట్ తో కుంగిపోకుండా.. ఎన్నికలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది.. ఇప్పటికే జనసేనతో తమన్ బై సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తెలుగుదేశం.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై ప్రతిరోజు నేతలతో సమావేశం అవుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజల నాడీ ఎలా ఉండబోతుంది, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వ విధానాల పైన, పథకాల పైన ఎలాంటి అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయో, చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ బలం పెరిగిందా లేదా అనేకంశాలకు సంబంధించిన ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం.. అంతేకాదు టిడిపి గెలుపుకు సంబంధించి సర్వేలు చేయడానికి ఆ పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.. టీడీపీ రాజకీయ వ్యూహ కర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ ఆధ్వర్యంలో బ్యాక్ రూమ్ ఏర్పాటు చేశారు..రాబిన్ శర్మ ఆధ్వర్యంలో ఈ బ్యాక్ రూమ్ పని చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో కూడిన ఒక కమిటీతో రాబిన్ శర్మ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. పార్టీకి సంబంధించినటువంటి కమిటీలతో మాట్లాడ్డం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వంటి అంశాలతో పాటు ఎన్నికలకు, పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలను దీనిలో చర్చిస్తారని తెలుస్తోంది.. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణతో , నారా బ్రాహ్మణి ఈ బ్యాక్ రూమ్ సమావేశాలకు హాజరైనట్టు తెలుస్తుంది.. దీని ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి మద్దతు ప్రజల నుండి వస్తుంది, పార్టీ పరిస్థితి ఏంటి, జనసేన టీడీపీ కలయిక పైన ప్రజలేమనుకుంటున్నారా అనే దాని పై సర్వేలు చేయించడం, ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వంటివి చేయబోతున్నారు. వచ్చే సర్వేల ఆధారంగా టీడీపీ జనసేన కూటమిని బలోపేతం చేయడం,రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.. ఇక జనసేన పార్టీ సమన్వయం చేసుకోవడం, రెండు పార్టీలు కలిసి ఈ విధంగా కార్యచరణ సిద్ధం చేయాలి అనే దాని పైన కూడా రాబిన్ శర్మ సూచనలు ఇస్తున్నట్లు సమాచారం.. ప్రజల ఫీడ్ బ్యాక్ , పార్టీ చేస్తున్న కార్యక్రమాల ఫీడ్ బ్యాక్ ను, దాని ద్వారా వ్యూహాలు సిద్ధం చేయడం వంటి చేయనున్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కసాని జ్ఞానేశ్వర్ కూడా చంద్రబాబులో కథ అయ్యారు.. తెలంగాణలో ఎక్కువ సీట్లు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణను ప్రచారం కోసం వాడుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సరికొత్త విధానాలను అవలంబిస్తుంది. ప్రజల నాడిని, దానిద్వారా ఓటర్లను ఆకర్షించడం చేయాలని నిర్ణయించుకుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించిన నిర్ణయాల్లో ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. #lokesh #tdp #chandrababu #voters #balakrishna #brahmani #back-room #pulse #robbin-sarma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి