AP Elections 2024: పరిటాల శ్రీరామ్‌ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా?

అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ సీటుపై సస్పెన్స్ నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు సీటు ఇచ్చారు. అయితే, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠగా కొనసాగుతుంది. పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

AP Elections 2024: పరిటాల శ్రీరామ్‌ సీటుపై ఉత్కంఠ..! రెండో సీటు ఇస్తారా?
New Update

Paritala Sriram MLA Ticket: ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. తెలుగుదేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.

Also Read: అంబానీ కొడుకు ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం భారత్ కు ప్రపంచ కుబేరులు.. 

శ్రీరామ్‌ సీటు పై ఉత్కంఠ

అయితే, అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ సీటుపై (Paritala Sriram MLA Ticket) సస్పెన్స్ నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు (Paritala Sunitha) సీటు ఇచ్చారు. మరి, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠగా ఉంది. పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం సీటు ఆశించినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తు ఉంటే సీటు తనదేనంటున్నారు సూరి. అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో 9 చోట్ల ప్రకటించగా 5 చోట్ల పెండింగ్‌ ఉంది. అనంతపురం (Ananthapuram), ధర్మవరం, కదిరి, గుంతకల్లు, పుట్టపర్తి నియోజకవర్గాలలో పరిటాల శ్రీరామ్‌ కు టికెట్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సీనియర్లకు ఎదురుదెబ్బ..

కాగా, టీడీపీ (TDP) సీట్ల ప్రకటనపై పలువరు సీనియర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వారికి టిక్కెట్‌ ఇవ్వనట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో సీనియర్లు దేవినేని ఉమ, గంటా, చింతమనేని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోడె ప్రసాద్‌, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌, బీకె పార్ధసారధి వారికి టిక్కెట్‌ దక్కలేదు. అనంతపురంలో పరిటాల ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్‌ ఇచ్చారు. తొలి జాబితాలో పరిటాల శ్రీరామ్‌కు అధిష్టానం సీటు ఇవ్వలేదని తెలుస్తోంది.

అసమ్మతి సెగ

ఇదిలా ఉండగా, పార్టీ పదవులకు గజపతినగరం టీడీపీ ఇంఛార్జ్ కేఏ నాయుడు రాజీనామ చేశారు. కొండపల్లి శ్రీనివాస్ కు గజపతినగరం టీడీపీ టికెట్ ఇవ్వడంతో మనస్థాపం చెంది పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. టీడీపీలో టికెట్ల ప్రకటనతో పలుచోట్ల సంబరాలు చేసుకుంటుండగా..మరోపక్క అశవాహులు నిరసనతో రోడ్డెక్కుతున్నారు.

#ananthapuram #tdp #andhra-pradesh #ap-elections-2024 #paritala-sriram #paritala-sunitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి