Satish Reddy: టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మరో నేత!

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి టీడీపీ ముఖ్య నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లు తనను చంద్రబాబు పట్టించుకోలేదని అన్నారు. తన శత్రువైన సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.

Satish Reddy: టీడీపీకి బిగ్ షాక్..  వైసీపీలోకి మరో నేత!
New Update

Satish Reddy: ఎన్నికల దగ్గర పడుతున్న వేళ టీడీపీకి షాక్ తగిలింది. జనసేనతో కలిసి తొలి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన టీడీపీకి ఆ పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. తమకు టికెట్ రాలేదని కొందరు టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. తాజాగా కడప జిల్లా పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి రాజీనామా చేశారు సతీష్‌ రెడ్డి. తనకు టికెట్ రాలేదని భంగపడ్డ ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటన చేశారు.

ALSO READ: మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?

నమ్మకం సన్నగిల్లింది..

తాను టీడీపీకి ఎందుకు రాజీనామా చేసి వైసీపీలోకి ఎందుకు చేరుతున్నాననే దానిపై వివరణ ఇచ్చారు సతీష్ రెడ్డి. ఆయన ఆర్టీవీ తో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్నారు. టీడీపీకి ఏజెంట్లు లేని స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఏజెంట్లు ఉండే స్థాయికి తెచ్చానని తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మీద నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు.

శత్రువే పిలిచాడు..

తన మీద అనేక ఆరోపణలు వచ్చాయని.. తన మాతృ సంస్థ టీడీపీ అని అన్నారు సతీష్ రెడ్డి. నాలుగేళ్లలో చంద్రబాబు ఏనాడూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ఎవరిపై పోటీ చేశానో, ఎవరితో శత్రుత్వం చేశానో వారే తనను పిలిచారని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నుంచి తనకు పిలుపు వచ్చిందని అన్నారు. నిజంగా తన మీద అభిమానం ఉంటే టీడీపీ ముందే ఎందుకు పిలవలేదని నిలదీశారు. వైసీపీ పిలుపు తర్వాతే తనను టీడీపీ నేతలు వచ్చి కలిశారని చెప్పారు. నాలుగు సంవత్సరాల పాటు కలవని వారికి ఇప్పుడు కనపడ్డానా అని ప్రశ్నించారు. అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీని అదికారంలోకి తెచ్చేందుకు తాను కృషి చేస్తానని అన్నారు.

#tdp #ap-elections-2024 #cm-jagan #kadapa-news #pulivendhula #satish-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe