PM Modi: టీడీపీ సభ.. ప్రధాని మోడీకి చేదు అనుభవం

ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చేదు అనుభవం అయింది. మోడి సభను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా ఆయన మైక్ మూడు సార్లు కట్ అయింది. దాదాపు ఎనిమిది నిమిషాల వరకు మైక్ పనిచేయలేదు. మైక్ కట్ అవ్వడంపై మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
PM Modi: టీడీపీ సభ.. ప్రధాని మోడీకి చేదు అనుభవం

PM Modi: పొత్తులో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీకి చేదు అనుభవం అయింది. మోడి సభను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుండగా ఆయన మైక్ మూడు సార్లు కట్ అయింది. దాదాపు ఎనిమిది నిమిషాల వరకు మైక్ పనిచేయలేదు. ప్రధాని ప్రసంగంలో మైక్ ఇంత సేపు కట్ కావడం ఇదే మొదటి సారి. ప్రధాని మోడీ ప్రసంగంలో మైక్ కట్ కావడం వల్ల అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక ప్రధాని సభకు ఇలానేనా ఏర్పాట్లు చేసేది అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తాను మాట్లాడే సమయంలో మైక్ కట్ కావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.

ALSO READ: చంద్రబాబు పొగడ్తల వర్షంలో తడిసిన ప్రధాని మోడీ

ఎన్డీఏకు ఓటు వేయాలి...

తెలుగులో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ప్రధాని మోడీ. దేశంలో నిన్ననే లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిందని అన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద నిర్ణయాలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. జూన్‌ 4న..ఎన్డీఏకు 400 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 400 దాటాలి..ఎన్డీఏకు ఓటు వేయాలంటూ తెలుగులో అభ్యర్థించారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఏపీని ఎడ్యూకేషన్‌ హబ్‌గా..

ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏపీలో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు మోడీ. ఎన్డీఏ బలం పెరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం అని పేర్కొన్నారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్లు తెలిపారు. ఎన్డీఏ ఎంపీలందరిని, ఎమ్మెల్యేలందరిని గెలిపించాలని కోరారు. వారంతా మీకు సేవ చేస్తారు..ఇది నా గ్యారెంటీ అని అన్నారు. ఏపీని ఎడ్యూకేషన్‌ హబ్‌గా మార్చాం అని తెలిపారు. టాప్ ఎడ్యూకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌లను ఎన్డీఏ సర్కార్ ఇచ్చిందని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ గొప్పవారు..

ఎన్టీఆర్ గొప్పవారని అన్నారు ప్రధాని మోడీ. ఆయన ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. రాముడు గెటప్ లో ఎన్టీఆర్ చూసి రాముడు అంటే ఎన్టీఆర్ లా ఉంటారని చాలా సార్లు అనుకున్నానని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పీవీ నర్సింహరావుకు భారత్‌రత్న ఇచ్చామని తెలిపారు. బీజేపీ, ఎన్డీఏ..పార్టీ లైన్ దాటి దేశం కోసం పని చేసిన నాయకులను గౌరవించుకుందని అన్నారు.

షర్మిల, జగన్ ఒకటే..

మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని అన్నారు మోడీ. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌, వైసీపీలు వేర్వేరు కాదు.. రెండు పార్టీలు ఒకే ఒరలో ఉన్నాయనిం ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తే.. ఏపీలో అభివృద్ధికి తిరిగి పునాది పడుతుందని భరోసా ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు