AP Opinion Poll 2023: ఏపీలో జగన్ కు షాకిచ్చిన సర్వే... ఎన్ని సీట్లు తగ్గుతాయంటే?

దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది.

New Update
CM Jagan: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

AP Elections 2024 Survey- India TV : దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ (YSRCP) సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ (TDP) కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ (BJP), ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ (Congress) కు కేవలం రెండు శాతం మాత్రమే ఓట్లు పడతాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో సంచలన సర్వే.. బీఆర్ఎస్ కు తగ్గనున్న సీట్లు.. లెక్కలివే!

ఇక ఏపీలో రానున్న లోకసభ ఎన్నికల్లో మొత్తం 25లోకసభ స్థానాలకు గానూ..వైసీపీ 15స్థానాల్లో గెలుస్తుందని..టీడీపీ 10 సీట్లలో గెలుపొందుతుందని సర్వే తేల్చింది. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార వైసీపీకి 22 స్థానాలు రాగా..టీడీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ప్రస్తుత సర్వే ప్రకారం వైసీపీ 7 ఎంపీ సీట్లు కోల్పోనుండగా..టీడీపీ 7 స్థానాలను తన ఖాతాలో వేసుకోనుందని సర్వే చెప్పింది. అంటే ఈ సర్వేను బట్టి చూస్తే జగన్ కు ప్రజల్లో కాస్త ఆదరణ కొంతమేర తగ్గిందని సర్వే చెబుతోంది.

publive-image

మొత్తంగా ఈ సర్వే ఫలితాలను చూస్తుంటే టీడీపీ వైపు ప్రజలు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రలో జైల్లో ఆపార్టీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ప్రజల నుంచి కాస్త సింపతి వచ్చినట్లే కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి:రాత్రి పదిలోపే నిద్రపోతే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

సీఎం జగన్ (CM Jagan) ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. దీంతో ఈ సర్వే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయా? లేదా అప్పటి వరకు రాజకీయ పరిస్థితులు మారి సర్వే రివర్స్ అవుతుందా? అన్నది తేలాలంటే ఎలక్షన్స్ పూర్తయి.. ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే!

Advertisment
తాజా కథనాలు