Hero Suman Comments On AP Next CM: సినిమా గ్లామర్ కు ప్రజలు ఓటు వేయరని ప్రముఖ హీరో సుమన్ (Hero Suman) అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ గ్రామర్ తో మంత్రి ఎమ్మెల్యేలు కావొచ్చు కానీ ముఖ్యమంత్రి కావడం కుదరదన్నారు. ఎన్టీఆర్ (NTR), ఎంజీఆర్ (MGR) ముఖ్యమంత్రులు అయినప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరన్నారు. 46 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నానన్నారు. తాను సెక్యూలర్ వాదిని అని అన్నారు.
ఇది కూడా చదవండి: YS Sharmila : వివేకాను చంపింది అవినాష్.. హంతకులకు రక్షగా జగన్ : పులివెందులలో షర్మిల సంచలన కామెంట్స్
దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్ని ఏదో ఓ కులానికో, మతానికో కొమ్ము కాస్తున్నాయన్నారు. అభివృద్ధి కంటే కులం, మతమే రాజకీయాలలో ఎక్కువగా ప్రభావితం చూపుతున్నాయన్నారు. రాజకీయాలు డబ్బు మయం అయ్యాయన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి డబ్బు, మద్యం, బిర్యానీలకు ప్రజలు లొంగిపోతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. కుల, మతాలు లేని కమ్యూనిస్ట్ పార్టీలను ప్రజలు ఎందుకు గెలిపించరని ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయం చేసే నాయకున్నే ఎంచుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆర్టీవీతో సుమన్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.