Former CM's Son Contesting in AP Elections: ఏపీలో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. అధికార వైసీపీ, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తి కాగా.. కూటమి అభ్యర్థుల ప్రకటన పూర్తి కావాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు ఖరారైన అభ్యర్థులను పరిశీలిస్తే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవనున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా పని చేసిన వైఎస్ కుమారుడు, ప్రస్తుత ప్రస్తుత సీఎం జగన్ (CM Jagan) మరో సారి పులివెందుల నుంచి పోటీలో ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంతో పాటు, విభజన తర్వాత ఏపీకి సీఎంగా పని చేసిన చంద్రబాబు కుమారుడు లోకేషన్ (Lokesh) మంగళగిరి నుంచి రెండో సారి పోటీకి దిగనున్నారు. వీరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ (Balakrishna) హిందూపురం నుంచి, నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) జనసేన తరఫున తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది.
వీరితో పాటు మరో మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాశ్ రెడ్డి డోన్ నుంచి ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఐదుగురు సీఎంల కుమారులు పోటీ పడుతుండడం ఈ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
ఇది కూడా చదవండి: YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోకు ముహుర్తం ఖరారు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?