Chandrababu: ప్రజాగళం సభలో ప్రధాని మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గెలుపు ఎన్డీఏదే..అనుమానం అవసరం లేదని అన్నారు. ప్రజల ఆశలను, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇది అని పేర్కొన్నారు. తమ కూటమికి ప్రధాని మోడీ అండ ఉందని అన్నారు. రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ALSO READ: పవన్ కళ్యాణ్ స్పీచ్… ప్రధాని మోడీ గరం
మోడీ అంటే శక్తి...
మా అజెండా ఒక్కడే..సంక్షేమం, అభివృద్ధి అని అన్నారు చంద్రబాబు. మోడీ వ్యక్తి కాదు.. ప్రపంచవేదికపై భారత్‌ను తిరుగులేని దేశంగా నిలిపిన శక్తి అని సంబోధించారు. ప్రధాని మోడీ అంటే దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి అని.. 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతను చాటిన వ్యక్తి అని కొనియాడారు. పేదరికం లేని దేశం.. మోడీ కల అని అన్నారు. మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలని హితవు పలికారు.
జగన్ నాశనలు..
మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ నాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ఫైర్ అయ్యారు. సహజ వనరులు దోచేసి.. తన సంపద దోచేసుకున్నారనిం ఆరోపణలు చేశారు. ప్రశ్నించేవారిని, మీడియాను అణచివేశారని ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆఫీసులు, మార్కెట్ యార్డులు తనఖా పెట్టారని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు గెలవాలని పిలుపునిచ్చారు.