Chegondi Surya Prakash To Join YCP: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రచారాలతో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య (Chegondi Harirama Jogaiah) కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2018లో జనసేనలో చేరారు సూర్యప్రకాష్. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వైఖరికి నిరసనగా సూర్య ప్రకాష్ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీట్ విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
Translate this News: