Pawan Kalyan: వైసీపీ నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు! విశాఖపట్నం జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీపై తనకు ఎలాంటి కక్ష లేదని, తనకు ఎవరూ శత్రువు కాదన్నారు. అందరూ కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. By srinivas 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Pawan Kalyan: వైసీపీ పార్టీపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని, ఎవరూ తనకు శత్రువు కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో పలువురు వైసీపీ నేతలు (YCP Candidates), కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో (Janasena) చేరడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. స్వయంగా వారికి కండువా కప్పి జనసేనలో ఆహ్వానించారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు పవన్ మాట్లాడుతూ..వైసీపీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. అందరం కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికి పనిచేయాలి. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుంది. విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసిగట్టుగా పోరాటం చేస్తామని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. శాసనమండలిలో బొత్స సత్యనారాయణను అడుగు పెట్టకుండా చేయడంతోపాటు వైసీపీని ఖాళీ చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది కూటమి ప్రభుత్వం. Also Read: ఎమ్మెల్సీగా గెలుపు నాదే.. బొత్స సంచలన కామెంట్స్ #pawan-kalyan #ap-news #ycp #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి