YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు

YSRCP పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ చీఫ్ షర్మిల. వైసీపీలో వైఎస్సార్ లేరని.. Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు.

YS Sharmila: Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి... షర్మిల సంచలన వ్యాఖ్యలు
New Update

AP Congress Chief Sharmila: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీలో ఇప్పుడు ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో పెట్టిన YSR కాంగ్రెస్ పార్టీ కాదని... Y అంటే YV సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణా రెడ్డి అని చురకలు అంటించారు. ఈ పార్టీలో వైఎస్సార్ లేడు అని పేర్కొన్నారు. మీది జగన్ రెడ్డి పార్టీ.. నియంత పార్టీ... ప్రజలను పట్టించుకోని పార్టీ అని మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ అని ఫైర్ అయ్యారు.

ALSO READ: టికెట్ చిచ్చు.. జేసీ దివాకర్‌రెడ్డికి చంద్రబాబు షాక్?

నాపై దాడి చేస్తున్నారు...

తనపై వైసీపీ పార్టీ నేతలు అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. తన సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని అన్నారు. తన బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా.. వైసీపీ పార్టీని తన బుజాల మీద వేసుకున్నానని భావోద్వేగానికి గురైయ్యారు. వైసీపీ కోసం తన రక్తం దార పోసినట్లు పేర్కొన్నారు. అదే వైసీపీ ఇప్పుడు తన మీద దాడి చేస్తుందని అన్నారు.

నేను వైఎస్సార్ బిడ్డని...

వైసీపీ పార్టీ నేతలు తనపై ఎన్ని దాడులు చేసిన భయపడేది లేదని.. తాను వైఎస్సార్ బిడ్డనని అన్నారు షర్మిల. మీకు చేతనయ్యింది చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. తాను అన్నిటికి రెడీ అని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి.. విశాఖ స్టీల్ ఉండాలి.. ఉద్యోగాలు రావాలి.. రైతు రాజ్యం రావాలి.. అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందని షర్మిల వ్యాఖ్యానించారు.

ALSO READ: రేపు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు

DO WATCH:

#ap-chief-sharmila #ap-latest-news #yv-subba-reddy #sajjala-ramakrishna #cm-jagan #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe