Sharmila: ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరడంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీ వీడటంపై షర్మిల స్పందించారు. ఎమ్మెల్యే ఆర్కే తనకు దగ్గర మనిషి అని అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి తనకు కారణాలు లేవని స్పష్టం చేశారు. ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైసీపీలోకి వెళ్లి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు.

New Update
Sharmila: ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరడంపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Sharmila: కాంగ్రెస్‌ను వీడి తిరిగి సొంత గూటిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే ఆర్కే పార్టీని వీడటంపై ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల స్పందించారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడానికి తనకు కారణాల్లేవని పేర్కొన్నారు. ఆర్కేకు తనకు మధ్య రాజకీయాలు లేవని అన్నారు. ఎమ్మెల్యే ఆర్కే తనకు దగ్గర మనిషి అని.. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి ఉండొచ్చు అని ట్విస్ట్ ఇచ్చారు.

ALSO READ: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్

చెల్లి వద్దు.. అన్నే ముద్దు..

మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు హైటెక్కుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ లో (YCP) చేరి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల వైఎస్ షర్మిల (YS Sharmila) తోనే నా ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ లో చేరిన అనంతరం కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు చేశారు.

కాంగ్రెస్ పై ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలు..

తిరిగి వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అన్నారు. సీఎం జగన్ ను తిట్టమనడం తనకు నచ్చలేదని తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో (AP Congress) పద్దతి పాడు ఏమి లేదని విమర్శించారు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ.. షర్మిల విధానం అలా లేదు.. కేవలం వ్యక్తిగతంగానే ఉంటుందని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై ఎన్నోసార్లు షర్మిల తో పాటు పార్టీకి చెప్పి చూశానని.. అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లడం తనకు నచ్చలేదని.. అందుకే షర్మిల తో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు