CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి హస్తినకు పయనం కానున్నారు. రేపు ప్రధాని మోడీతో (PM Modi) సీఎం జగన్ భేటీ కానున్నారు. ఎన్నికలకు (AP Elections) ముందు సీఎం జగన్ భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలు అమిత్ షా (Amit Shah), ఇతర నేతలను కలిసిన విషయం తెలిసిందే.
ALSO READ: ఈ నెల 16న వ్యూహం సినిమా రిలీజ్
రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. పొత్తులపై, విభజన హామీలపై, లేదా రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై సీఎం జగన్ మోడీ తో చర్చలు జరపనున్నారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి.
ఎంపీ ఎన్నికల్లో వైసీపీదే..
వై నాట్ 175 నినాదంతో ఈ సారి ఎన్నికల్లో అడుగు పెడుతోంది వైసీపీ. 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి మరోసారి ఆంధ్ర ప్రదేశ్ లో తమ జెండా ఎగురవేయాలని వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో సిట్టింగు ఎమ్మెల్యేలను మారుస్తాయి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొత్త ఇంచార్జిలను (New Incharges) నియమిస్తూ మొత్తం ఆరు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఇక, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో (MP Elections) అన్ని స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లేదా ఒకవేళ వేరే ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వాన్ని గెలిచిన సీట్లతో తమ గుప్పెట్లో పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఏపీలో మద్దతు ఇస్తే తాము కేంద్రంలో మద్దతు ఇస్తామని వైసీపీ ఇప్పటికే బీజేపీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ప్రధాని మోడీని కలవడం వెనుక ఎంపీ సీట్ల సర్దుబాటుపైనే ఉండి ఉంటుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి మరి.
ALSO READ: అసెంబ్లీలో కేసీఆర్ గది మార్పు.. బీఆర్ఎస్ నేతలు సీరియస్
DO WATCH: