Chandrababu Naidu : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. కొండచరియలు విరిగిపడే అవకాశాలు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు.

New Update
Chandrababu Naidu : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. కొండచరియలు విరిగిపడే అవకాశాలు!

Heavy Rain Alert : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదివారం విజయవాడ (Vijayawada) లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల (Heavy Rains) దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాబు ప్రకటించారు. ఏలేరు ప్రాజెక్టు (Yeleru Project) ఇన్ ఫ్లో గమనించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఉత్తరాంధ్రలోని విశాఖ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండచరియలు (Landslides) విరిగిపడే ప్రమాదం ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే, కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వివరించారు. ఆ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు వివరించారు.

Also Read: రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు