AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం!

ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు.

AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం!
New Update

AP GOVT :  ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) భర్తీ పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం దృష్టి పెట్టింది. తన ప్రభుత్వంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తొలుత విద్యా శాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా ఎన్డీయే సర్కార్ (NDA Sarkar) కసరత్తులు మొదలు పెట్టింది. మెగా డీఎస్సీతో పాటు మరో 8, 168 ఖాళీలను భర్తీ చేసే దిశగా చంద్రబాబు గవర్నమెంట్‌ అడుగులు వేస్తుంది.

నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశంపై ఏపీ సీఎం ఆరా తీస్తున్నారు. కేజీబీవీల్లో 4, 594 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేయొచ్చని అధికారుల వెల్లడించారు.అలాగే, 612 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను ఏపీ ప్రభుత్వం అదనంగా పెంచనుంది.

సుప్రీం కోర్టు (Supreme Court) ఉత్తర్వుల ప్రకారం 2, 962 ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చన్న విద్యా శాఖ అధికారులు చూస్తున్నారు. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు అధికారులు తెలిపారు. తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆ ఖాళీల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

విద్యా శాఖ తరహాలోనే మిగిలిన శాఖల్లోనూ పోస్టుల భర్తీ చేయాలనే యోచనలో ఏపీ సీఎం ఉన్నారు.

Also read: నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు.. ఈ లింక్ తో రిజల్ట్స్!

#government-jobs #ap-cm-chandrababu #tdp #politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe