ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా ఈ నెల 11న కేబినెట్ భేటీ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ నెల 14కు కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది

New Update
YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన అధిష్టానం.. కారణం ఇదే..!

AP Cabinet : ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. డిసెంబరు 11న జరగాల్సిన ఈ భేటీ ఈనెల 14వ తేదీకి వాయిదా వేస్తూ సీఎస్‌ కార్యాలయం నోట్‌ విడుదల చేసింది. డిసెంబరు 14న ఉదయం 11గంటలకు సీఎం జగన్‌ (CM Jagan) అధ్యక్షతన మంత్రిమండలి భేటీ అవుతుందని పేర్కొంది. 12వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్‌ కార్యాలయం ఆదేశించింది.

ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురువడంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లిన సీఎం జగన్‌ అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో అందరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు. తుఫాన్ బాధితులను పరామర్శించిన జగన్ ప్రతి ఇంటికి రూ. 2500 ఇస్తామని పేర్కొన్నారు. అలాగే తర్వలో రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. 

ALSO READ: కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ

Advertisment
తాజా కథనాలు