AP BJP Chief Purandeswari: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాల్లో (AP Politics) పొత్తుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ (BJP-TDP Alliance) పొత్తు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జోరందుకుంది. అయితే.. జనసేనతో (Janasena) పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? గందరగోళంలో ఉందని ఏపీ బీజేపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపార్టీ హైకమాండ్ తో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ పొత్తు ఉంటే ఏపీలో బీజేపీకి 10 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్ల కావాలని హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట.
బీజేపీ అడుగుతున్న నియోజకవర్గాలు, అభ్యర్థులు ఇవే..
* అసెంబ్లీ : విశాఖ నార్త్ - విష్ణు కుమార్ రాజ్
* అసెంబ్లీ : పొద్దుటూరు - మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి
* అసెంబ్లీ : ఆళ్లగడ్డ - భూమా కిషోర్‌రెడ్డి
* అసెంబ్లీ : ధర్మవరం - వరదాపురం సూరి
* అసెంబ్లీ : రాజమండ్రి - సోము వీర్రాజు
* అసెంబ్లీ : పి గన్నవరం- అజయ్ వేల మాజీ
* అసెంబ్లీ : కదిరి - విష్ణువర్ధన్ రెడ్డి
* అసెంబ్లీ : కైకలూరు - కామినేని శ్రీనివాస్..
* ఒంగోలు , నెల్లూరు జిల్లాల్లో ఒక్కో సీటు
* పార్లమెంట్ : తిరుపతి - రత్నప్రభ
* పార్లమెంట్ : విశాఖ - సుజనా చౌదరి
* పార్లమెంట్ : నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
* పార్లమెంట్ : రాజంపేట లేదా హిందూపురం - సత్యకుమార్
* పార్లమెంట్ : రాజమండ్రి - పురంధేశ్వరి
ALSO READ: కుర్చీలు మడతపెట్టడమే.. సీఎం జగన్‌కు లోకేష్ వార్నింగ్
ఈ నెల 20వ తేదీ తరువాతే క్లారిటీ...
ఈ నెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దె దించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యమవుతుందని పవన్ బీజేపీ నేతలకు సలహా ఇస్తున్నారట. కలిసి పోటీ చేయడం ద్వారా ఏపీలో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడవచ్చని.. అలాగే బీజేపీకి కూడా వోట్ షేర్ పెరగడానికి పొత్తు ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్టానానికి పవన్ సూచనా చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఏపీలో పొత్తుల క్లారిటీ రావాలంటే ఈ నెల 20వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.