AP BJP: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది.. పురంధేశ్వరి ఫైర్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పాలనపై నిప్పులు చెరిగారు ఆ రాష్ట్ర బీజేపీ ఛీఫ్ పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వం రూ .170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

New Update
AP BJP: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది.. పురంధేశ్వరి ఫైర్

AP BJP Chief Purandeswari: పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, శక్తీ కేంద్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో పార్టీని బలోపేతం చేయటానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ రోజు పాలకొల్లులో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో పురందేశ్వరి ముఖాముఖి అయ్యారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ తమ ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టారని బాధితుల ఆరోపణలు చేశారు. బ్యాంకుల నోటీసులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పురంధేశ్వరి హామీ ఇచ్చారు.

ALSO READ: : 11 మంది IASల బదిలీ

పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా తొమ్మిదిన్నర ఏళ్లలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జిల్లా వాసుల కోసం 216 జాతీయ రహదారి రూ. 316 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కోటిపల్లి- నర్సాపురం రైల్వే లైన్ పనులు 75 శాతం కేంద్ర ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ వాటా 25 శాతం నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు లక్షా అయిదు వేల ఇళ్లు కేంద్ర మంజూరు చేస్తే ఎన్ని ఇళ్ళు నిర్మించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ ప్రభుత్వం రూ .170 కోట్లకు టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న ఆన్యాయాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సాగు నీరు కాల్వల అభివృద్ధికి కేంద్ర నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఆడుదాం ఆంధ్ర పథకం కాదు.. ఆంధ్ర రాష్ట్రంతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ నిరంకుసత్వ పరిపాలన సాగుతోందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు