Andhra Pradesh: ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఈ నెల 22వ తేదీ లేదా ఆ తర్వాత తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌తో కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్ధిక శాఖ ఎదురు చూస్తోంది.

AP Assembly Sessions : రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
New Update

AP Assembly Sessions: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని భావిస్తోంది ఆర్ధికశాఖ. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ లేదా దాని తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుటోంది. మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఏపీ ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా. అప్పటికి ఏపీ ఆర్ధిక పరిస్థితిపై ఓ క్లారిటీ వస్తుందని..అప్పుడు సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక శాఖ అనుకుటోంది. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు దగ్గర కూడా తీసుకెళ్ళింది. ఆర్డినెన్స్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.

Also Read:Andhra Pradesh: రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు-మంత్రి నాదెండ్ల ఆదేశం

#andhra-pradesh #assembly #sessions #july-22nd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe